తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ భవనానికి సీఎం రేవంత్ రెడ్డి చేత భూమి పూజ
హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్యులకు కేటాయించిన స్థలంలో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ భవనానికి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ కార్యదర్శి భాశెట్టి నాగేశ్వర్ తెలిపారు.
ఆదివారం ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ జరగనుందని తెలిపారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ అమరవాది లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో శంకుస్థాపనతో పాటు శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆర్యవైశ్యుల ఎన్నో సంవత్సరాల కల ప్రస్తుతం నెరవేరుతుందని భాశెట్టి నాగేశ్వర్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు శ్రీ కైలాస్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.