ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం STU నిరంతర పోరాటం
ఎస్టీయూ 79 సంవత్సరాలు పూర్తి చేసుకుని 80వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ ఆడిటోరియంలో ఎస్టీయూ 80 వసంతాల మహోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గీత కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ, ఒక సంఘం 80 సంవత్సరాల పాటు నిరంతరంగా కొనసాగడం వెనుక ఎంతో కృషి, నిబద్ధత, పోరాట స్ఫూర్తి ఉంటాయని అన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం ఎస్టీయూ చేసిన నిరంతర కృషి వల్లే ఇన్ని దశాబ్దాలుగా ఉపాధ్యాయుల ఆదరణను పొందుతూ బలమైన సంఘంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ఎస్టీయూ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
గీత కార్మికుల సంక్షేమ సంఘం చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఎస్టీయూ నిరంతరం ఉపాధ్యాయుల సమస్యల పట్ల నిబద్ధతతో పనిచేస్తోందన్నారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం రిటైర్డ్ సంఘ నాయకులు, సీనియర్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ, గత 80 సంవత్సరాలుగా ఎస్టీయూ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం పోరాడుతూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసిందన్నారు. 1946లో నిజాం కాలంలోనే ఎస్టీయూ ఆవిర్భవించిందని, అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసిందని తెలిపారు.
రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయడంతో పాటు, 5 పెండింగ్ డీఏలు, పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఈ నెల 18న ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ మాట్లాడుతూ, 80 సంవత్సరాలుగా ఎస్టీయూ ఉపాధ్యాయుల పక్షాన నిరంతరం పోరాడుతూ వారి హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి సంఘం ముందుండి పోరాడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబీర్ అలీ, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్, రాష్ట్ర బాధ్యులు బి. శ్రీనివాస్, ఎ. శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు కలీమొద్దీన్, సీనియర్ నాయకులు శివచరణ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.