వెల్లుట్ల పేటలో వినాయకులను దర్శించుకున్న ఎమ్మార్వో ప్రేమ్ కుమార్
వెల్లుట్ల పేటలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ వివిధ గణేష్ మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
•1 నిమిషం చదవాలిఅప్డేట్: September 21, 2026
వెల్లుట్ల పేటలో వినాయకులను దర్శించుకున్న ఎమ్మార్వో ప్రేమ్ కుమార్
వెల్లుట్ల పేట గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎమ్మార్వో ప్రేమ్ కుమార్ వివిధ వినాయక మండపాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని గణేష్ మండపాల వద్ద భక్తులు, నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వెల్లుట్ల పేట సర్పంచ్ కొయ్యల వినోద్ రాజా గౌడ్, బంధం బొల్లు భూమయ్య, కొట్టాల బాలాజీ, పటేల్ అనిల్, GPO భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Yaswanth Pavahar
పవార్ వార్త • సైట్ అడ్మిన్
Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.