వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకోవాలి: తొర్రూరు డీఎస్పీ కృష్ణ కిషోర్
భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశమని డీఎస్పీ కృష్ణ కిషోర్ పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకునేలా ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు.
పండుగ సమయంలో సోషల్ మీడియాలో వచ్చే నేరపూరిత మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా నేరపూరిత సందేశాలు సోషల్ మీడియా గ్రూపుల్లో వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ శాంతి సమావేశంలో మరిపెడ సీఐ పవన్ కుమార్, ఎస్‌ఐ గండ్రాతి సతీష్, ఎస్‌ఐ మహబూబి, ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.