ఎల్లారెడ్డి పెద్దచెరువు వద్ద గణేష్ నిమజ్జనం: చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరిశీలించారు. గణేష్ శోభాయాత్రలో పాల్గొని, నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సజావుగా జరిగేలా అధికారులు, సిబ్బందికి చైర్మన్ పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ, చెరువులో దిగి ఎవరైనా గణపతులను నిమజ్జనం చేయడం వల్ల ఈత రాని వారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం మూలంగా రెండు హైడ్రా క్రేన్‌లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా నిమజ్జన కార్యక్రమం జరిపిస్తున్నామని తెలిపారు. అలాగే ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లను కూడా రప్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్‌ఓ, ఫైర్ అఫీసర్లు, వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. నిమజ్జన ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ మరియు ఇతర మౌలిక వసతులను వారు పరిశీలించారు.
ప్రజలు మరియు గణేష్ ఉత్సవ నిర్వాహకులు అధికారులకు సహకరించి, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని చైర్మన్ కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.