వైశ్య భవన్‌లో గణపతి పూజల్లో సీఐ, ఎస్సై.. పోలీసు అధికారులకు సన్మానం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని వైశ్య భవన్‌లో నిర్వహించిన వినాయక చవితి గణపతి పూజా కార్యక్రమాల్లో ఎల్లారెడ్డి సీఐ దొరవారి రాజ్‌రెడ్డి, ఎస్సై ఎన్. రాజు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వైశ్య భవన్ నిర్వాహకులు, భక్తులతో కలిసి పోలీసు అధికారులు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పోలీసు అధికారులకు సన్మానం
అనంతరం ఎల్లారెడ్డి మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ సిద్ధి శ్రీధర్ గుప్తా సీఐ దొరవారి రాజ్‌రెడ్డి, ఎస్సై ఎన్. రాజులను ఘనంగా సన్మానించారు.
వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా అభినందించారు.
కార్యక్రమంలో భక్తులు, వైశ్య భవన్ నిర్వాహకులు, స్థానికులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.