డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను “కల్పిత నాయకుడు” అంటూ వ్యాఖ్యలు చేశారంటూ బీబీపేట మండల అంబేద్కర్ యువజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అంబేద్కర్‌పై అమర ప్రసాద్ అనే వ్యక్తి పుస్తకం రచించినట్లు పేర్కొన్న సంఘాల నాయకులు, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను భారతరత్న, ప్రపంచ మేధావి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల పితామహుడిగా, కుల అహంకార గోడలను బద్దలు కొట్టిన మహనీయుడిగా వారు పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిపై “కల్పిత నాయకుడు” అంటూ వ్యాఖ్యలు చేయడం సరికాదని అంబేద్కర్ యువజన సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో అమర ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని బీబీపేట మండల అంబేద్కర్ యువజన సంఘాలు డిమాండ్ చేశాయి.

ఈ మేరకు దాదాపు 50 మంది వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో 11 గ్రామాలకు చెందిన దళిత నాయకులు పాల్గొన్నారు.

0 మంది ఇష్టపడ్డారు
షేర్
డౌన్‌లోడ్న్యూస్ పేపర్ క్లిప్పింగ్ • హై క్వాలిటీ

మరిన్ని వార్తలు

వ్యాఖ్యానించండి