అక్టోబర్ 6న ‘చలో హైదరాబాద్’కు హాజరుకావాలి.. బాన్సువాడలో MRPS–MSF సమావేశం
బాన్సువాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో MRPS ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. MSF ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న విద్యార్థుల సమావేశానికి హాజరయ్యేలా బాన్సువాడలోని వివిధ కళాశాలల విద్యార్థులను కలిసి అవగాహన కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు.
అక్టోబర్ 6న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి విద్యార్థులు హాజరుకావాలని సమావేశంలో పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులతో సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో మంతెన సామేలు, కామారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్, MSF జిల్లా కో-ఇంచార్జ్ మెక్క సాయి, MRPS నాయకులు గాంధారి గంగారం, కామారెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలు బానపురం లావణ్య, బీర్కూర్ మండల MRPS నాయకులు రాచకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.