బిచ్కుంద: బిచ్కుంద పట్టణంలోని 4వ వార్డులో గత 15 రోజులుగా తాగునీటి సరఫరా సక్రమంగా లేక కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ నియోజకవర్గ ఇంచార్జి జాదవ్ ఈశ్వర్ తెలిపారు.
ఈ విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించేందుకు ప్రత్యామ్నాయంగా వెంటనే ట్యాంకర్‌ను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు.
అయితే ట్యాంకర్ తాత్కాలిక ప్రత్యామ్నాయం మాత్రమేనని, 4వ వార్డులో నెలకొన్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జాదవ్ ఈశ్వర్ కోరారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా జరిగేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు తాగునీరు అందించడం కనీస బాధ్యత అని, 4వ వార్డు ప్రజలకు శాశ్వతంగా నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను కోరినట్లు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

