బిచ్కుంద: బిచ్కుంద మండలం హాస్గూల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ హన్మంత్ బాలాజీ మాతృమూర్తి కొన్ని రోజుల క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాస్గూల్‌లోని హన్మంత్ బాలాజీ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించిన హన్మంత్ షిండే, హన్మంత్ బాలాజీతో పాటు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు హాస్గూల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతురాలి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

