హైదరాబాద్: చర్లపల్లి డివిజన్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్‌లో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు.
ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతిపై సంబంధిత అధికారులు, సిబ్బందిని ఎమ్మెల్యే వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
బీఎన్ రెడ్డి నగర్‌లో రోడ్ల అభివృద్ధితో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారుతాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.


స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.