పత్రికా ప్రకటన
బోధన్‌లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్
నిజామాబాదు, తేది: 22-09-2026
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం పసుపు వాగు వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.
ఈ బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. నిమజ్జన ప్రదేశాన్ని పరిశీలించి, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
నిమజ్జన కార్యక్రమం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగేలా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని, భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు, నిమజ్జన ప్రదేశంలో జనసందోహం నియంత్రణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గణేష్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి, శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడాలని పోలీస్ కమిషనర్ కోరారు.
ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ శ్రీ శ్రీనివాస్, బోధన్ ఎస్‌హెచ్‌ఓ శ్రీ వెంకట్ నారాయణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ శరత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ. యోగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.