గార్ల మండలంలో డీజే వినియోగం: నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఎస్సై
గార్ల, మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా డీజే సిస్టమ్‌ను వినియోగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ముందుగా హెచ్చరికలు, విజ్ఞప్తులు చేసినప్పటికీ, గార్ల మండలంలోని ముత్తి తండా గ్రామంలో ఒక డీజే సిస్టమ్‌ను వినియోగిస్తున్నట్లు స్థానిక గార్ల పోలీసులు గుర్తించారు.
నిమజ్జనం పూర్తయిన అనంతరం డీజే నిర్వాహకుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకుని రావడం జరిగిందని గార్ల ఎస్సై సాయికుమార్ తెలిపారు. ఆ డీజే నిర్వాహకుడిపై మరియు గణేష్ కమిటీ సభ్యులపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎవరైనా డీజేను ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్సై మరోసారి స్పష్టం చేశారు.
ఆ డీజేను సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు సోషల్ మీడియా, పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.