చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్ల ప్రారంభానికి ఏర్పాట్లు పరిశీలించిన పోచారం భాస్కర్ రెడ్డి
చందూర్ మండల కేంద్రంలో ఈ నెల 12వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను ప్రారంభించి, ఆయకట్టు పొలాలకు సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చందూర్, ఉమ్మడి వర్ని మండల నాయకులతో కలిసి చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ మోటారు పంపులను, సాగునీటి విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను, సభా స్థలాన్ని పరిశీలించారు.
కార్యక్రమానికి హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్థానిక నాయకులకు పోచారం భాస్కర్ రెడ్డి సూచించారు.
చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడంతో రైతుల పొలాలకు నీరు చేరి వ్యవసాయానికి మరింత బలాన్ని చేకూర్చనుందని తెలిపారు. పంటల సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతుల దిగుబడులు, ఆదాయం పెరగడానికి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో చందూర్, ఉమ్మడి వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోచారం భాస్కర్ రెడ్డి వెంట ఉన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.