చెంగిచర్లలో రూ.55,111కు వినాయకుడి లడ్డూ.. తాళ్లపల్లి శ్రీకాంత్ గౌడ్-కావ్య దంపతుల సొంతం
ప్రతిఏటా నిర్వహించే లడ్డూ వేలం పాట ఈసారి కూడా స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. వేలంలో పోటీ నెలకొనగా, తాళ్లపల్లి శ్రీకాంత్ గౌడ్-కావ్య దంపతులు రూ.55,111కు లడ్డూను దక్కించుకున్నారు.
విఘ్నేశ్వరుడి ప్రసాదమైన లడ్డూను కైవసం చేసుకోవడంపై శ్రీకాంత్ గౌడ్ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. స్వామివారి ఆశీస్సులతో తమ కుటుంబంతో పాటు కాలనీవాసులందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు శ్రీకాంత్ గౌడ్ దంపతులను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం గణనాథుని మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కాలనీవాసుల జయజయధ్వానాల మధ్య వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.