చిన్నక్రాంతి కాలనీలో ఘనంగా గణపతి నిమజ్జనం.. రూ.95 వేలకు లడ్డూ వేలం
మేడిపల్లి, సెప్టెంబర్ 28: మేడ్చల్ జిల్లా చెంగిచర్ల డివిజన్ పరిధిలోని చిన్నక్రాంతి కాలనీలో వక్రతుండ బ్రదర్స్ ఆధ్వర్యంలో గణపతి నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. గణపతి బప్పా మోరియా నినాదాలు, డప్పు దరువులు, భక్తుల నృత్యాల మధ్య గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు, ధూపదీప నైవేద్యాలతో పూజలందుకున్న వినాయకుడి నిమజ్జన శోభాయాత్రలో కాలనీ వాసులు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పు దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు.
లడ్డూ వేలంలో రూ.95 వేలు
నిమజ్జన వేడుకల్లో భాగంగా నిర్వహించిన ప్రసాదాల వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల మధ్య పోటాపోటీగా సాగిన వేలంలో గోపికృష్ణ రూ.95 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. మరో లడ్డూను శ్రీనివాస్ రూ.57 వేలకు సొంతం చేసుకున్నారు.
అలాగే స్వామివారి పంచ వేలంలో లక్ష్మణ్ రూ.18 వేలకు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. వేలంలో విజేతలుగా నిలిచిన ముగ్గురిని వక్రతుండ బ్రదర్స్ నిర్వాహకులు, కాలనీ పెద్దలు శాలువాలతో సత్కరించారు.
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం
వేలం కార్యక్రమం అనంతరం కాలనీ పురవీధుల గుండా వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత భక్తిశ్రద్ధలతో గణపతి నిమజ్జనాన్ని పూర్తి చేశారు.
నిమజ్జన వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన కాలనీ వాసులందరికీ వక్రతుండ బ్రదర్స్ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.