ఖమ్మం డీఈఓ (ఎఫ్‌ఏసీ)గా కొనసాగుతున్న వాసంతికి మహబూబాబాద్ అదనపు బాధ్యతలు
మహబూబాబాద్, అక్టోబర్ 7: మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా (DEO) డి. వాసంతికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్, ఐఏఎస్ పేరుతో అక్టోబర్ 7, 2026న జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రకారం.. ప్రస్తుతం భద్రాద్రి-కొత్తగూడెం డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్‌గా, ఖమ్మం జిల్లా డీఈఓ (ఎఫ్‌ఏసీ)గా వ్యవహరిస్తున్న డి. వాసంతిని మహబూబాబాద్ జిల్లా డీఈఓ పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతల్లో నియమించారు.
ఈ నియామకం తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తక్షణమే అమల్లో ఉంటుంది. మహబూబాబాద్ జిల్లా డీఈఓ అదనపు బాధ్యతలను వెంటనే స్వీకరించి, సంబంధిత కార్యాలయానికి అనుసరణ నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆమోదంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సంబంధిత ఉత్తర్వుల ప్రతులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, ఖమ్మం జిల్లా డీఈఓ, వరంగల్ ప్రాంతీయ సంయుక్త పాఠశాల విద్యా సంచాలకులు, తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖకు పంపించారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


