విద్యార్థుల విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు వివరించిన విద్యార్థులు
మేడిపల్లి, అక్టోబర్ 7: బోడుప్పల్‌లోని నారాయణ హైస్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు, వారి విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు స్వయంగా వివరించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి నారాయణ విద్యాసంస్థల జీఎం గోపాల్ రెడ్డి, ఏజీఎం బాలపరమేశ్వర్, ఆర్‌అండ్‌డీ విభాగాధిపతులు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ మహేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ మహాదేవి కూడా కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మహేశ్వరి మాట్లాడుతూ ‘స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్’ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు తమ విద్యా ప్రగతిని తల్లిదండ్రులకు స్వయంగా వివరించేందుకు ఇది మంచి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు.
విద్యార్థులు తమ ప్రతిభ, బలాలు, ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అంశాలతో పాటు, తాము రూపొందించిన ప్రాజెక్టులు, ఇతర విద్యా కార్యకలాపాలను తల్లిదండ్రులకు వివరించారు.
విద్యార్థుల ప్రతిభను, వారి ప్రాజెక్టులను చూసిన ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికితీసేలా కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రిన్సిపాల్ మహేశ్వరి, ఈ-ఛాంప్స్ వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందాన్ని వారు అభినందించారు.

133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


