ఎల్లారెడ్డిలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం
ఎల్లారెడ్డి బాలగౌడ్ ఫంక్షన్ హాల్‌లో అలింకో, సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, లింగంపేట్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలకు చెందిన మొత్తం 76 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు.
ఎల్లారెడ్డి మండలం నుంచి 20 మంది, నాగిరెడ్డిపేట్ నుంచి 16 మంది, లింగంపేట్ నుంచి 20 మంది, నిజాంసాగర్ నుంచి 8 మంది, మహమ్మద్ నగర్ నుంచి 12 మంది విద్యార్థులు శిబిరంలో పాల్గొన్నారు.
శిబిరంలో అర్హత పొందిన 76 మంది దివ్యాంగ విద్యార్థులకు డిసెంబర్ నెలలో సహాయ ఉపకరణాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ రాజులు, జిల్లా సహిత విద్య సమన్వయకర్త శ్రీ నాగవేందర్, అలింకో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ శరత్, ఆడియోలాజిస్ట్ శ్రీమతి స్వాతి పాల్గొన్నారు.
అలాగే IERPs శ్రీ వెంకటేశం, సాయిలు, శ్రీమతి సుజాత, అశ్విని, దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.