ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు
దొంగతనానికి గురైన వాహనాలు, అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు తనిఖీలు
ఎల్లారెడ్డి, అక్టోబర్ 10 (పవార్ వార్త): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని ఎల్లారెడ్డి అంబేద్కర్ చౌక్ వద్ద పోలీసులు ప్రతిరోజూ ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏఎస్ఐ దేవ గౌడ్, పోలీసు కానిస్టేబుల్‌తో కలిసి తనిఖీలు చేపడుతున్నారు.

ఈ తనిఖీల ద్వారా దొంగతనానికి గురైన వాహనాలను గుర్తించడంతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, స్మగ్లింగ్‌కు పాల్పడే వ్యక్తులను గుర్తించే అవకాశం ఉంటుందని ఏఎస్ఐ దేవ గౌడ్ తెలిపారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతిరోజూ ఉదయం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాహన తనిఖీల ద్వారా నేరాల నియంత్రణకు, అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


