ఎల్లారెడ్డి గణేష్ మండపాలకు లడ్డూ వితరణ.. పోస్టర్ ఆవిష్కరణ
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలకు లడ్డూ వితరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎల్లారెడ్డి మండలంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న గణేష్ మండపాలకు రెండోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా ఆధ్వర్యంలో చేపట్టనున్న లడ్డూ వితరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కురుమ సాయిబాబా మాట్లాడుతూ.. ఎల్లారెడ్డి మండలంలోని ప్రతి గణేష్ మండపానికి లడ్డూ అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న యువతను ప్రోత్సహించడంతో పాటు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా లడ్డూ వితరణ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.
యువతలో భక్తి, ఐక్యత, సేవాభావాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కురుమ సాయిబాబా పేర్కొన్నారు.
పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎల్లారెడ్డి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, గణేష్ మండపాల నిర్వాహకులు, యువకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ప్రతి మండపానికి లడ్డూ వితరణ చేయడం ద్వారా భక్తి, సేవాభావంతో కూడిన పండుగ వాతావరణాన్ని నెలకొల్పేందుకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.