ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే రూ.5 లక్షలు సరిపోవట్లేదు.. బడ్జెట్ పెంచాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇస్తున్న రూ.5 లక్షలు సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే రూ.10-15 లక్షలు అవసరం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఇంటి నిర్మాణంలో మేస్త్రిలకే రూ.3-4 లక్షలు ఖర్చవుతున్నాయని, నిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగిపోయాయని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న మొత్తం నిర్మాణ ఖర్చులకు సరిపోవడం లేదని ఆయన అన్నారు.
చాలా మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరైనప్పటికీ డబ్బులు లేక నిర్మాణ పనులు ప్రారంభించలేదని ఆయన చెప్పారు. మరికొందరు డబ్బులు సరిపోక బంగారం కుదవపెట్టి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించారని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం ఇంటి నిర్మాణానికి రూ.10-15 లక్షలు అవసరం అవుతున్న పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇళ్ల బడ్జెట్‌ను పెంచాలని ఆయన కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.