విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: పద్మ శ్రీకాంత్
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోందని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. గురువారం ఎల్లారెడ్డి మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు యూనిఫాం, షూస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా నోటుబుక్కులు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, షూస్ అందిస్తోందని తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తున్నారని, దీని ద్వారా విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
విద్యార్థులు బాగా చదివి ప్రయోజకులు కావాలని పద్మ శ్రీకాంత్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తోట గాంధీ, వైస్ ప్రిన్సిపల్ ఆల్తమాష్ జహంగీర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, లక్ష్మణ్ సింగ్, విద్యారమణ, కోఆప్షన్ సభ్యులు పప్పు వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.