వరంగల్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం.. పటేల్ విగ్రహానికి బీజేపీ నేతల నివాళులు
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వరంగల్‌లోని వెంకట్రామ జంక్షన్‌లో బీజేపీ నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్‌తో పాటు ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి, అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర అజరామరమని బీజేపీ నాయకులు కొనియాడారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తీరుపై విమర్శలు
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల తీరును బీజేపీ నాయకులు ఖండించారు.
పాల్గొన్న బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులతో పాటు బీజేపీ వరంగల్ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకుడు, వరంగల్ జిల్లా సేవా పక్వాడ్ ఇన్‌చార్జ్ గుర్రాల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.