గండిమసానిపేట్‌లో రూ.1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎల్లారెడ్డి మండలం గండిమసానిపేట్ గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామ అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకుని రూ.1 కోటి నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పేర్కొంది.
మంజూరైన నిధులతో గ్రామంలోని అవసరమైన ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపింది. పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసినట్లు పేర్కొంది.
గ్రామ అభివృద్ధికి కృషి చేసి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వెల్లడించింది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.