విఠల్‌రావు మృతి.. కోర్టు విధులకు దూరంగా ఎల్లారెడ్డి న్యాయవాదులు
బిచ్కుంద బార్ అసోసియేషన్‌కు చెందిన సీనియర్ న్యాయవాది, ఏజీపీ విఠల్‌రావు ఆకస్మిక మృతికి సంతాపంగా సెప్టెంబర్ 11న కోర్టు విధులకు దూరంగా ఉండాలని ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు న్యాయవాదులు తెలిపారు.
విఠల్‌రావు సెప్టెంబర్ 10 గురువారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలియడంతో ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
విఠల్‌రావు మృతికి సంతాప సూచకంగా సెప్టెంబర్ 11న కోర్టు పనులకు హాజరు కాకుండా అబ్స్టెయిన్ చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.
న్యాయవాద వృత్తిలో విఠల్‌రావు అందించిన సేవలను ఈ సందర్భంగా పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి బిచ్కుందతో పాటు న్యాయవాద వర్గాల్లో విషాదాన్ని నింపిందని పేర్కొన్నారు.
ఈ మేరకు ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తీర్మానాన్ని ప్రకటించగా, బార్ అసోసియేషన్ సభ్యులు తమ సంతకాలతో మద్దతు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.