జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత.. రెగ్యులేటర్‌పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేసినా అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రైతులు స్వయంగా నీటిని విడుదల చేసుకున్నారు.
జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కిన రైతులు అక్కడి నుంచి సాగునీటిని వదులుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు రోజంతా ఆందోళన చేపట్టినప్పటికీ అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.