అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మల సేవలు అభినందనీయం: రాథోడ్ సునీత
జుక్కల్: మండలంలోని లాడేగావ్ గ్రామంలో అంగన్ మిలన్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ఎస్సీ వాడ అంగన్‌వాడీ కేంద్రం, ప్రైమరీ స్కూల్ అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలను సన్మానించారు.
ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా బీజేపీ మహిళా మోర్చా కో-ఇన్‌చార్జి రాథోడ్ సునీత మాట్లాడుతూ, చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్య కోసం అంగన్‌వాడీ టీచర్లు, ఆయమ్మలు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి సన్మానించడం ఆనందంగా ఉందన్నారు.
విద్యార్థులు, గర్భిణులకు పండ్ల పంపిణీ
కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాలాజీ పటేల్, బుడాల గంగరాజు, సంబాజీ పటేల్‌తో పాటు గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.