మాచాపూర్ విద్యార్థిని బోనగిరి నందినికి రూ.లక్ష ప్రోత్సాహకం

ఎల్లారెడ్డి: పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన మాచాపూర్ జడ్పీహెచ్‌ఎస్ విద్యార్థినికి అరుదైన గౌరవం దక్కింది. ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన బోనగిరి అంజయ్య కుమార్తె బోనగిరి నందిని ఎల్లారెడ్డి నియోజకవర్గ టాపర్‌గా నిలిచి రూ.లక్ష ఉపకార వేతనం అందుకున్నారు.

శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘చదువుకో తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా గురువారం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సంస్థ ప్రతినిధుల చేతుల మీదుగా నందిని ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ ఉపకార వేతనాలు అందిస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కాస్పరస్ జాకోబస్ హెండ్రిక్ క్రోమ్‌హౌట్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 632 మంది విద్యార్థులను ఎంపిక చేయగా, తొలి విడతలో 134 మందికి ఉపకార వేతనాలు అందించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర టాపర్‌కు రూ.5 లక్షలు, రెండో స్థానానికి రూ.3 లక్షలు, జిల్లా టాపర్లకు రూ.2 లక్షలు, నియోజకవర్గ టాపర్లకు రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు మొత్తంగా రూ.2.2 కోట్ల ప్రోత్సాహకాలు అందించనున్నట్లు వెల్లడించారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గ టాపర్‌గా నిలిచి రూ.లక్ష పురస్కారం అందుకున్న నందినిని గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభినందించారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply