ప్రెస్ నోట్
CEIR పోర్టల్ ద్వారా 2,027 మొబైల్ ఫోన్ల రికవరీ: బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ
మహబూబాబాద్ జిల్లా
మహబూబాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి గుర్తించి రికవరీ చేయడంలో జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ CEIR (Central Equipment Identity Register) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగిస్తూ ఇప్పటివరకు జిల్లా పరిధిలో 2,027 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
జిల్లా ఎస్పీ డా. శబరీష్ మార్గదర్శకత్వంలో తాజాగా చేపట్టిన ప్రత్యేక చర్యల్లో 77 మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత బాధితులకు జిల్లా ఎస్పీ డా. శబరీష్ చేతులమీదుగా అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, CEIR పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతిక సమాచారాన్ని విశ్లేషిస్తూ, వివిధ ప్రాంతాల్లో వినియోగంలో ఉన్న పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తిస్తున్నామని అన్నారు.
ఈ ప్రక్రియలో మహబూబాబాద్ డీఎస్పీ, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ హతీరామ్, ఐటీ సెల్ ఎస్‌ఐ జి.వి. కృష్ణారెడ్డి, పీసీ సుమన్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సీఈఐఆర్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు.
మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌కు సంబంధించిన ఐఎంఈఐ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలను పోలీసులకు అందించాలని తెలిపారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడంతో పాటు, అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి ఫోన్‌ను గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలు మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు సమాచారం అందించి సీఈఐఆర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ కోరారు. ప్రజల ఆస్తి పరిరక్షణలో భాగంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందజేసేందుకు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్పీ తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.