నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ గణేష్ నిమజ్జనోత్సవానికి ఘన ఏర్పాట్లు
నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడి నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. నిమజ్జనానికి సిద్ధమవుతున్న గణేష్ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పంతులు మోహన్ జోషి, బజరంగ్ దళ్ నాయకుడు రజనీకాంత్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, గణనాథుడికి మొక్కులు చెల్లించుకున్నారు. నారాయణఖేడ్‌లో బజరంగ్ దళ్ గణేష్ నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.