మహబూబాబాద్, అక్టోబర్ 3: మహబూబాబాద్ పట్టణంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు పోలీసులు నార్కోటిక్ డాగ్ సహాయంతో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు సోదాలు చేపట్టారు.
రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ఎఫ్‌ఆర్‌ఓ సెంటర్, నెహ్రూ సెంటర్, ఎంఆర్‌ఓ సెంటర్, తొర్రూరు బస్టాండ్ ప్రాంతాలతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఆదేశాల మేరకు, టౌన్ డీఎస్పీ నంబూరి తిరుపతిరావు సూచనల ప్రకారం ఈ తనిఖీలు చేపట్టినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ రఘుపతి రెడ్డి తెలిపారు.

డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అక్రమంగా మత్తు పదార్థాలను రవాణా చేసినా, నిల్వ ఉంచినా చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పిల్లలు, యువకుల ప్రవర్తనలో మార్పులు గమనించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఇన్‌స్పెక్టర్ ప్రజలను కోరారు. మహబూబాబాద్‌ను గంజాయి రహిత జిల్లాగా మార్చే లక్ష్యంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ తనిఖీల్లో డాగ్-హ్యాండ్లర్ పీసీ శివరాజ్, బ్లూకోట్ సిబ్బంది పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

