నాగారం సాయి ధరణి నగర్ కాలనీలో 100 మట్టి వినాయకుల పంపిణీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్‌లోని నాగారం డివిజన్-5 సాయి ధరణి నగర్ కాలనీ ఫేజ్-2లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కాలనీ ప్రజలకు 100 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడానికి అంగీకరించినట్లు తెలిపారు.

కాలనీ ప్రధాన కార్యదర్శి పులవర్తి శ్యామ్ అభ్యర్థన మేరకు ఈ విగ్రహాల పంపిణీకి అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా శనివారం కొన్ని మట్టి వినాయక విగ్రహాలను కాలనీలో పంపిణీ చేశారు.

మిగిలిన మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం ఉదయం 10 గంటలకు కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ వద్ద పంపిణీ చేయనున్నట్లు కాలనీ పాలకవర్గం తెలిపింది. కాలనీ ప్రజలు కమ్యూనిటీ హాల్ వద్దకు వచ్చి మట్టి వినాయక విగ్రహాలను తీసుకోవాలని కోరింది.

“మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం” అనే సందేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply