నాగారంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.51 వేలకు లడ్డూ వేలం
మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ సాయి ధరణి నగర్ కాలనీ ఫేజ్-2లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. కాలనీ వాసులు గత 14 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వినాయక చవితి నుంచి ఏడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గణేష్ నిమజ్జన వేడుకలను నిర్వహించారు. ముందుగా ఉట్టి కొట్టు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించారు.
లడ్డూ వేలం పాటలో గరిష్టంగా రూ.51 వేల ధర పలికింది. ఈ లడ్డూను కాలనీ నివాసి మెడగొని నగేష్ కైవసం చేసుకున్నారు.
గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన పాటలు, డాన్స్ పోటీల్లో పాల్గొన్న పిల్లలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
అనంతరం గణేష్ నిమజ్జన ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.