పెద్ద కొడప్‌గల్‌లో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ: 22 మందికి రూ.22.02 లక్షలు మంజూరు
పెద్ద కొడప్‌గల్: పేద కుటుంబాలకు ఆడపిల్లల వివాహ సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదల పెన్నిధిగా నిలుస్తున్నాయని పెద్ద కొడప్‌గల్ మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి అన్నారు.
శుక్రవారం పెద్ద కొడప్‌గల్ తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజశేఖర్‌తో కలిసి బస్సీ బాగిబాయి, పర్థాల్ కాటేపల్లి తండాకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి ఈ పథకాలు ఎంతో అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
తహసీల్దార్ రాజశేఖర్ మాట్లాడుతూ, పెద్ద కొడప్‌గల్ మండలానికి 20 కల్యాణ లక్ష్మి, 2 షాదీ ముబారక్ చెక్కులు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.22,02,552 మంజూరైనట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్, పాండు నాయక్, జీపీఓ రాములు తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.