పెద్ద కొడప్‌గల్ మండల హిందీ టాపర్‌కు ఘన సన్మానం: రూ.1,100 నగదు ప్రోత్సాహకం
పెద్ద కొడప్‌గల్, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్‌గల్ మండల స్థాయిలో నిర్వహించిన హిందీ వ్యాస రచన పోటీలో మండల టాపర్‌గా నిలిచిన కాటేపల్లి జడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థిని తబుసుంను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లప్ప పటేల్ బుధవారం ఘనంగా సన్మానించారు.
కాటేపల్లి జడ్‌పీహెచ్‌ఎస్‌లో జరిగిన కార్యక్రమంలో తబుసుంకు రూ.1,100 నగదు ప్రోత్సాహక బహుమతి అందజేశారు. అలాగే విద్యార్థిని ప్రతిభకు ప్రోత్సాహం అందించిన పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు సునీతను కూడా సన్మానించారు.
ఈ సందర్భంగా మల్లప్ప పటేల్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో ప్రతిభను ప్రోత్సహించేందుకు తనవంతుగా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షల్లో పాఠశాల టాపర్‌గా నిలిచిన సాబ్లే నందిని మధుసింగ్‌కు రూ.11 వేల నగదు ప్రోత్సాహక బహుమతి అందజేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
ఈ విద్యా సంవత్సరంలో కాటేపల్లి పాఠశాల విద్యార్థి పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిస్తే రూ.21 వేల, పాఠశాల టాపర్‌గా నిలిస్తే రూ.11 వేల నగదు ప్రోత్సాహకం అందజేస్తానని మల్లప్ప పటేల్ ప్రకటించారు. అలాగే నవోదయ సీటు సాధించిన విద్యార్థికి రూ.1,500 నగదు ప్రోత్సాహకం అందజేస్తానని తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీ పరీక్షలు, పోటీల్లో ప్రతిభ కనబరిచి కాటేపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మల్లప్ప పటేల్ ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవ్, శంకర్, లలిత, సుజాత, భక్షి రామ్, మంజుల, అశోక్, దేవిదాస్ తదితరులు పాల్గొన్నారు.
మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం
వాట్సాప్ ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.