బీరంగూడలో ఫేక్ రియల్ ఎస్టేట్ మోసం: అదనపు కలెక్టర్‌కు బాధితుడి వినతి

సంగారెడ్డి జిల్లా బీరంగూడలో ఫేక్ రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద ప్లాటుకొని మోసపోయానని కూకట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి తమ బాధను అదనపు కలెక్టర్ సంగీతకు వినతి పత్రం అందజేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీరంగూడలో ఒక ప్లాటు కొనుగోలు చేసి దొంగల ముఠా ద్వారా మోసపోయామని ఎం. శ్రీనివాసులు తెలిపారు. తాను 20 సంవత్సరాలుగా సంపాదించిన సొమ్ము అంతా వారి చేతిలో పెట్టగా, వారు దొంగ డాక్యుమెంట్లతో ప్లాటు అమ్మారని, తీరా రిజిస్ట్రేషన్‌కు వెళ్లి చూడగా మూసపోయామని తెలిసిందని ఆయన పేర్కొన్నారు.

మల్టిపుల్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లు అమ్ముతున్నారని, ఇలా అమ్మిన ప్లాటు ద్వారా తాను మోసపోయి చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నానని, ఇప్పటివరకు తనకు మేలు జరగలేదని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఆర్‌డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన పట్టించుకునే నాధుడే లేదని తన ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ విషయమై మెదక్ ఆర్‌డీఓ కార్యాలయానికి వెళ్తే ఈ పేరు గల ఆర్‌డీఓ ఇక్కడ పనిచేయలేదని తెలిపారని ఆయన తెలియజేశారు. మెదక్ ఆర్‌డీఓ కార్యాలయంలో పనిచేయని ఆర్‌డీఓ సంతకంతో మమ్మల్ని మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ దొంగల ముఠాపై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయిందని, వీరిని మియాపూర్ పోలీసులు కోర్టుకు హాజరుపరచగా కోర్టు జైలు శిక్ష కూడా విధించిందని ఆయన తెలిపారు. అయితే తనలాగా ఇంకా వీరి చేతిలో ఎవరు మోసపోకూడదని తాను వీరిపై పోరాటం చేస్తున్నానని శ్రీనివాసులు మీడియా ద్వారా తెలియజేశారు.

తనకు ఫేక్ డాక్యుమెంట్ల ద్వారా అమ్మినవారు దామోదర్ రెడ్డి, కాసులవాడి కృష్ణ, కాసులవాడి సతీష్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తనకు తన డబ్బులు తిరిగి ఇప్పించే విధంగా జిల్లా కలెక్టర్ నిందితులపై తగిన చర్యలు తీసుకొని తనకు రావలసిన డబ్బులు ఇప్పించవలసిందిగా ఆయన కోరారు.

అలాగే వీరు తననే కాకుండా జిన్నారం మండలంలోని కాజిపల్లిలో కూడా రెండు ఎకరాలు కంభంపాటి అనురాధ అనే మహిళ అమ్మి వేరే వారిని కూడా మోసం చేశారని ఆయన గుర్తుచేశారు. ఆమెకు ఒక్కొక్క డాక్యుమెంట్‌లో ఒక్కొక్క పేరు భర్తగా చూపించారని అన్నారు. ఆమె అమ్మిన నాలుగు డాక్యుమెంట్లలో నలుగురు వేర్వేరు పేర్లు భర్తగా చూపించారని, ఆమె చేసిన డాక్యుమెంట్లలో ఎలాంటి ఆధారాలు లేవని, ఆధార్ కార్డు గానీ ఇతర ఏ ఆధారాలు లేవని తెలిపారు.

ఇలాంటి ఫేక్ డాక్యుమెంట్లపై రిజిస్ట్రేషన్లు చేస్తున్న రిజిస్ట్రేషన్ అధికారులపైన, ప్రభుత్వ అధికారుల సంతకాలను దుర్వినియోగం చేసిన ఇలాంటి దొంగలపైన తగిన చర్యలు తీసుకొని వీరి చేతిలో మోసపోయిన తనలాంటి వారికి తగిన న్యాయం చేయాలని ప్రెస్ మీట్‌లో ఆయన కోరారు.

ఈ వార్తను షేర్ చేయండి

మా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి – అప్‌డేట్ వార్తల కోసం

వాట్సాప్ ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Reporter Siddhu
Reporter Siddhu పవార్ వార్త • వార్తా రచయిత ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply