బీబీపేటలో వినాయక నిమజ్జనం: గణనాథులకు భక్తిశ్రద్ధలతో వీడ్కోలు

కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధల మధ్య ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాథులను మంగళవారం నిమజ్జనం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలో ప్రతి సంవత్సరం నవరాత్రులు పూర్తయిన అనంతరం వినాయకులను ఒకేసారి నిమజ్జనానికి తరలించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

నిమజ్జనానికి ముందు మండపాల వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సాయంత్రం వినాయక విగ్రహాలను వాహనాలపై ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు. భక్తులు ‘జై గణపయ్య.. జై జై గణపయ్య’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.

నిమజ్జన కార్యక్రమం సందర్భంగా తాజా మాజీ ఎంపీటీసీ భర్త కొరివి నర్సింలు మండలంలోని 50కిపైగా వినాయక మండపాలను సందర్శించి గణనాథులను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలందరూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. గ్రామస్తులంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.

నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులు, భక్తులకు ఆయన అభినందనలు తెలిపారు. నిమజ్జన కార్యక్రమంలో గ్రామస్తులు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply