బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో మోదీ జన్మదినం సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని బిచ్కుంద బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించాలని పిలుపు
ఈ సందర్భంగా బిచ్కుంద బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతూ.. 25 ఏళ్ల ప్రజాసేవకు ప్రతీకగా, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ప్రధాని మోదీకి 140 కోట్ల మంది భారతీయుల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 17 సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతి ఇంటా ఆశీర్వాద దీపం వెలిగించి మోదీని ఆశీర్వదించాలని ఆయన కోరారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బుడాల గంగారాజ్, పాస్కె ప్రకాష్, దన్నూర్ విటల్, మాసాని సంతోష్, పత్తి రమేష్, లక్కవార్ శంకర్ పటేల్, రాజిరెడ్డి, హడికే రాజు, మొగులు గొండ, లక్ష్మణ్ చారి, నవీన్, గోపాల్ చారి, లాలు, శివాజీ పటేల్, ధర్మానాయక్, శ్రీనివాస్, సంతోష్ పటేల్, మోహన్ దేశాయి, గణపతి తదితరులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.