బాంబే హైకోర్టులో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 14 నిర్ణయాలపై సవాల్
ముంబై: బాంబే హైకోర్టు కొల్హాపూర్ బెంచ్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న 14 చర్యలను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
ఈ నిర్ణయాలపై మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణ, కొత్త ఓటర్ల నమోదు అంశాలపై వారు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు పిటిషన్‌లో తెలిపారు.
తొలగించిన ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తారు.
ఎస్‌ఐఆర్ ప్రక్రియపై పారదర్శకత, చట్టపరమైన ఆధారాలను వెల్లడించాలని కోరుతూ మరో పిటిషన్ కూడా దాఖలైంది. అక్రమంగా ఓటర్ల పేర్లు తొలగించకుండా రక్షణ కల్పించాలని కూడా కోరారు.
ఈ పిటిషన్లను సెప్టెంబర్ 28న సంబంధిత బెంచ్‌ల ముందు ప్రస్తావించే అవకాశం ఉంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.