హైదరాబాద్: ఉమ్మడి చెర్లపల్లి డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మారుతి ఎంక్లేవ్‌లో రూ.22 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు.

మారుతి ఎంక్లేవ్‌లో పార్క్ అభివృద్ధి
స్థానిక ప్రజల సౌకర్యార్థం చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.. చిన్నారులు, వృద్ధులు, స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్‌ను అభివృద్ధి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాగార్జున నగర్‌లో రోడ్డు పనుల పరిశీలన

అనంతరం నాగార్జున నగర్‌లో జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రోడ్డు అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఎమ్మెల్యేకు స్థానికుల కృతజ్ఞతలు
తమ ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.


