డాక్టర్ బాలు–బుక్క రజని దంపతులకు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
హైదరాబాద్‌లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ బాలు, లింగంపేట్ మండల కేంద్రంలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న బుక్క రజని దంపతులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026 అందుకున్నారు.
వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ కాచం సత్యనారాయణ, యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుండా మల్లయ్య గుప్తా, పవన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవి గుప్తా చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందజేశారు.
పురస్కారాలకు ఎంపిక చేసినందుకు నిర్వాహకుడు కాచం సత్యనారాయణ గుప్తాకు డాక్టర్ బాలు, బుక్క రజని కృతజ్ఞతలు తెలిపారు.
ఉపాధ్యాయుడు కేవలం విద్యను బోధించడం మాత్రమే కాకుండా విద్యార్థుల్లో విలువలు, సామాజిక సేవా దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత కూడా ఉందని వారు పేర్కొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.