అనాథ వృద్ధులకు వెల్లుట్లపేట సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ ఆపన్నహస్తం
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్ అనాథ, నిరాశ్రయ వృద్ధులకు సహాయం అందించారు. లింగంపేటలోని జీవదాన్ అనాథ ఆశ్రమంలో నివసిస్తున్న వృద్ధులకు శనివారం బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, స్నాక్స్ తదితరాలను పంపిణీ చేశారు.
అనంతరం వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడిన సర్పంచ్.. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొయ్యల వినోద రాజా గౌడ్ మాట్లాడుతూ, అనాథ వృద్ధులకు తమకు తోచినంత సాయం చేయడం సామాజిక బాధ్యత అని అన్నారు. తన వంతుగా కొంత సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. వృద్ధులకు సేవ చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీవదాన్ అనాథ ఆశ్రమం నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వృద్ధులకు సహాయం అందించిన సర్పంచ్ కొయ్యల వినోద్ రాజా గౌడ్‌ను ఆశ్రమం నిర్వాహకులు అభినందించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.