ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డిలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి, అధ్యాపకులు విద్యార్థులతో మొక్కలను నాటించారు. అదేవిధంగా విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ. లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ అనగా జాతీయ సేవా పథకం (National Service Scheme) అని, సమాజ సేవలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని తెలిపారు. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు సేవా భావాన్ని అలవర్చుకొని సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ప్రిన్సిపాల్ గారు తెలిపారు.

అదేవిధంగా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ పీఓ ఐ.ఎస్. చంద్రకాంత్ మాట్లాడుతూ, కళాశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి నాలుగవ శనివారం పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఎన్ఎస్ఎస్‌లో భాగంగా ప్రతి సంవత్సరం ఏడు రోజుల క్యాంపు నిర్వహించి, ఒక ఊరిని దత్తత తీసుకొని అక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఊరిలోని ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు సమాజంలోని వివిధ వర్గాల వారితో అవినావా బావ సంబంధాలు కూడా కలుగుతాయని ఆయన పేర్కొన్నారు. అందుకే విద్యార్థులందరూ స్వచ్ఛందంగా సమాజ సేవలో పాల్గొనాలని ఆయన వివరించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ చంద్రకాంత్, ఐక్యూఏసి సమన్వయ కర్త డాక్టర్ వి. శంకరయ్య, నాగనిక, సైన్స్ ఇన్‌చార్జ్ డాక్టర్ అరుణ్ కుమార్, ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ పీఓ ఐ.ఎస్. చంద్రకాంత్, డాక్టర్ గంగారెడ్డి, డాక్టర్ సిద్దిరాజు, కృష్ణ ప్రసాద్, డాక్టర్ గోదావరి, సంతోష్, శశిధర్, సంగీత, మహమూద్, నరేష్ గౌడ్, లక్ష్మణ్, పవన్, వసంతలక్ష్మి, అధ్యాపకేతర బృందం మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి

కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి

WhatsApp ఛానెల్ జాయిన్
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply