మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీలో నీటి సంరక్షణ నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ ఆశిష్ సాంగ్వాన్, ఐ.ఏ.ఎస్ గారు యెల్లారెడ్డి మండలంలోని మీసాన్‌పల్లి గ్రామ పంచాయతీని సందర్శించి, అక్కడ చేపట్టిన నీటి సంరక్షణ చెరువు (Water Harvesting Pond) మరియు రూఫ్‌టాప్ రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పెంపుదలకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో యెల్లారెడ్డి ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, ఎంపీడీఓ తహెరా బేగం, DRDO ప్రతినిధులు, ఎంపీడీఓ, ఎంపీఓ, ఏపీఓ, మండలంలోని అన్ని శాఖల మండల అధికారులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, టెక్నికల్ అసిస్టెంట్లు (TAs) మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు (FAs) పాల్గొన్నారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.