గణేష్ నిమజ్జనంలో డీజేలకు అనుమతి లేదు: కామారెడ్డి ఎస్పీ
కామారెడ్డి జిల్లాలో గణేష్ నిమజ్జన ఊరేగింపుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌కు అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం డీజే నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ ఈ విషయాన్ని వెల్లడించారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన సూచించారు.
అధిక శబ్దంతో కూడిన డీజేల కారణంగా వినికిడి సమస్యలు, రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎస్పీ పేర్కొన్నారు. అలాగే నిమజ్జన ఊరేగింపుల్లో ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, పోలీస్ శాఖ నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి ఇవ్వడం లేదని ఎస్పీ స్పష్టం చేసినట్లు సమాచారం. గణేష్ ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.