గార్లలో ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గార్ల: జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు సోమవారం గార్ల మండలంలోని ఎరువుల దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లోని ‘ఓ’ ఫారం, స్టాక్ బోర్డు, స్టాక్ రిజిస్టర్‌తో పాటు లైసెన్స్ గడువును పరిశీలించారు.
అనుమతి లేని ఎరువులు విక్రయిస్తే చర్యలు
ఈ సందర్భంగా కావటి రామారావు మాట్లాడుతూ, అనుమతి లేని ఎన్‌పీకే (NPK) మిశ్రమాలు, నిషేధిత కలుపు మందు పారాక్వాట్‌ను విక్రయించినా, గోదాముల్లో నిల్వ ఉంచినా సంబంధిత డీలర్లపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లైసెన్స్‌లో పొందుపరిచిన ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని స్పష్టం చేశారు.
ఈ-పాస్ ద్వారానే ఎరువుల విక్రయాలు
ప్రతి ఎరువుల డీలర్ తప్పనిసరిగా ఈ-పాస్ (e-POS) మిషన్ ద్వారానే విక్రయాలు జరపాలని రామారావు సూచించారు. గోదాముల్లోని వాస్తవ నిల్వలు, స్టాక్ రిజిస్టర్ వివరాలు, ఈ-పాస్ మిషన్‌లో నమోదైన నిల్వలు సరిసమానంగా ఉండాలని తెలిపారు. ఎరువుల విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.