గార్ల ఆశ్రమ బాలికల హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో మంగమ్మ
గార్ల మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల వసతి గృహాన్ని ఎంపీడీవో మంగమ్మ గారు గురువారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఆమె వెంట మేజర్ గ్రామపంచాయతీ కార్యదర్శి మధు నాయుడు ఉన్నారు.
ఈ సందర్భంగా హాస్టల్‌లోని వసతులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత, మరుగుదొడ్లు, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థుల హాజరు, రిజిస్టర్లను ఎంపీడీవో పరిశీలించారు.
అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తూ వసతులు ఎలా ఉన్నాయి, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వార్డెన్‌ను ఆదేశించారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.