గాయపడిన జాతీయ పక్షి నెమలికి వైద్య చికిత్స.. రక్షించిన చర్చ్ ఫాదర్
ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ వద్ద ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడిన జాతీయ పక్షి నెమలిని చర్చ్ ఫాదర్ రెవరెండ్ డాక్టర్ ఈ ప్రభాకర్ రక్షించారు. గాయపడిన నెమలిని గుర్తించిన ఆయన వెంటనే స్థానిక ఎస్సై రాజుకు ఫోన్ చేసి జరిగిన సంఘటనను వివరించారు.
సమాచారం అందుకున్న ఎస్సై రాజు స్పందించి, ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ రమేష్‌కు విషయాన్ని తెలియజేశారు. అనంతరం వెటర్నరీ డాక్టర్ అర్చనకు ఫోన్ చేసి, గాయాలపాలైన నెమలికి వైద్య చికిత్స అందించాలని కోరగా, ఆమె స్పందించి వెటర్నరీ హాస్పిటల్ కంపౌండర్‌ను పంపించారు.
వెటర్నరీ హాస్పిటల్ కంపౌండర్ గాయపడిన నెమలిని పరీక్షించి, వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ సిబ్బంది గాయపడిన నెమలికి వైద్య చికిత్సలు అందించి, ఎఫ్ఆర్ఓ రమేష్‌కు అప్పగించారు.
తన కార్యాలయంలో గాయపడిన నెమలిని తన పర్యవేక్షణలో ఉంచుకుని, అది పూర్తిగా కోలుకున్న తర్వాత యథాస్థానంలో వదిలిపెడతామని ఎఫ్ఆర్ఓ రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ రమేష్ మాట్లాడుతూ, మానవతా దృక్పథంతో గాయపడిన పక్షిని రక్షించడంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు, వెటర్నరీ డాక్టర్‌కు త్వరగా సమాచారం అందించి రక్షించడంలో రెవరెండ్ డాక్టర్ ఈ ప్రభాకర్ చూపిన సమయస్ఫూర్తిని అభినందించారు.
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా భావించి వన్యప్రాణుల పట్ల ప్రేమతో ఉండాలని, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకోవడానికి విద్యుత్ వైర్లు చుట్టి అడవి జంతువులను హతమార్చడం నేరమని, వన్యప్రాణులను వేటాడడం గానీ, చంపడం గానీ చేయొద్దని, ఒకవేళ చేసినచో కఠినంగా శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. వన్యప్రాణుల పట్ల ప్రేమ, దయ, జాలితో ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.