కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టిందన్న ప్రచారంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల ఆస్తులు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలమైన మీడియాతో చెప్పించి రాయించారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ లక్ష కోట్ల ఆస్తులను రేవంత్ రెడ్డి తీసుకుని, మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఫార్ములా ఈపై కేటీఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్‌కు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకువచ్చేలా ఫార్ములా ఈ ఈవెంట్‌ను తీసుకువచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే అందులో ఏదో జరిగిందంటూ ఈవెంట్‌ను రద్దు చేసి తనపై కేసు పెట్టారని ఆయన ఆరోపించారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఒక మోటార్ రేసింగ్ ఈవెంట్ కోసం లండన్ వెళ్లి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నించారని కేటీఆర్ పేర్కొన్నారు. అదే విధంగా తాము ఫార్ములా ఈ ఈవెంట్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా తమపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన అన్నారు.
న్యాయ వ్యవస్థపై విశ్వాసం ఉందన్న కేటీఆర్
న్యాయస్థానాలపై, న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన విశ్వాసం ఉందని కేటీఆర్ తెలిపారు. అందుకే రెండోసారి కోర్టు విచారణకు హాజరైనట్లు ఆయన చెప్పారు.
భవిష్యత్తులో ఎప్పుడు పిలిచినా కోర్టు విచారణకు హాజరవుతానని కేటీఆర్ పేర్కొన్నారు.
కేటీఆర్‌తో కలిసి కోర్టుకు ఎమ్మెల్యే కృష్ణారావు
కేటీఆర్‌తో కలిసి కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ ఇన్‌చార్జ్ రాగిడి లక్ష్మారెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.